రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్న ఐపీఎల్ 2020...
ఐపీఎల్ 2020 రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఫైనల్ బెర్తులు ఖాయమనుకున్న జట్లు అనూహ్యంగా ఓటమి పాలవుతున్నాయ్. ఇక పనైపోయిందనకున్న టీమ్స్ విజయ ఢంకా మోగిస్తున్నాయ్. క్వాలిఫైయర్ -2 లో ఢిల్లీ ప్రత్యర్థి ఎవరో తేలింది. ఈ ఏడాది ఐపీఎల్ ఫేవరెట్ అనుకున్న బెంగళూరు ఎప్పటిలాగే ఇంటి బాట పట్టింది. వారం రోజుల కింద అంచనాలు లేని సన్‌రైజర్స్ సూపర్ జోష్‌తో దూసుకెళుతోంది. వరుసగా నాలుగో విక్టరీ కొట్టిన ఆరెంజ్ ఆర్మీ కప్‌కి రెండడుగుల దూరంలో నిలిచింది. రేపు జరిగే క్వాలిపైయర్-2లో ఢిల్లీని బోల్తా కొట్టి ఫైనల్‌కు దూసుకెళ్లాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. మరోవైపు ముంబై చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న కసితో బరిలోకి దిగుతోంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఎవరు ఫైనల్స్ లో ముంబైని ఢీ కొడుతారు అనేది చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)