ఏ సెలబ్రటీ ఎక్కడ ఓటు వేస్తున్నాడంటే..

ఏ సెలబ్రటీ ఎక్కడ ఓటు వేస్తున్నాడంటే..

ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల వేడి పెరుగుతోంది. నేడే పోలింగ్ కావడంతో ఉత్కంఠ మరింత అధికమవుతోంది. ఎన్నికల మొదలు కావడంతో ప్రతీ పార్టీ భారీగా ప్రశంగాలు, ర్యాలీలతో ప్రజలను తమను గెలిపించమని కోరారు. అయితే ఈ ఎన్నికల్లో సినీతారలు కూడా ఓట్లు వేసేందుకు రానున్నారు. మరి ఏ సెలబ్రటీ ఎక్కడ ఓటు వేయనున్నాడో తెలుసుకొండి. ప్రస్తతుం ఆచార్య సినిమా షూటింగ్‌లో ఎంత బీజీగా ఉన్నా సామాజిక బాధ్యతతో కుటుంబంతో కలిసి ఓటువేసేందుకు ఉదయం 7 గంటల 30నిముషాలకు జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రానికి రానున్నారు. అయితే కృష్ణంరాజు కూడా అదే పోలింగ్ సెంటర్‌లో ఓటు నమోదు చేయనున్నారు. అదేవిదంగా గ్రీకు వీరుడు నాగార్జున కుటుంబ సమేతంగా అమల, సమంత, అఖిల్, నాగ చైతన్యాలతో కలిసి తెలంగాణ వుమెన్ కోపరేట్ సోసైటీ సెంటర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ పుష్పరాజ్ కూడా తన కుటంబ సభ్యులు అల్లు అర్జున్, అల్లు స్నేహ, అల్లు శిరీష్‌లు తమ ఇంటి ముందే ఉన్న ఉలవచారు రెస్టారెంట్‌కు వెళ్లే దారిలో తమ ఓటు వేసి నాయకుడిని ఎంచుకోవడంలో తన పాత్రను పోషించనున్నారు. ఇక ఇటీవల తన సినీ జీవితంలో 41సంత్సరాలు పూర్తిచేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామీలీ మహేష్, నమ్రత, సరేష్, కృష్ణ వీరు భారతీయ విద్యభవన్ జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కును వినియోగించనున్నారు.

ఇక కొమరం భీమ్ యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ తన కుంటుంబ సమేతంగా ఓబులరెడ్డి స్కూల్ కేంద్రంలో ఓటును నమోదు చేయనున్నారు. బీజేపీ నేత విజయ శాంతి 9 గంటలకు యూరో కిడ్స్ స్కూల్‌ బంజారా హిల్స్‌లో ఓటు వేయనున్నారు. ఇక ఇజం అంటూ ప్రజలకు నిజం చెప్పిన కళ్యాణ్ రామ్ మంటెస్ బీకరీ బంజారాహిల్స్ పోలింగ్ బూత్‌తో 7గంటల 30నిమిషాలకు ఓటు వేయనున్నారు. ఇక దగ్గుపాటిగారి కుటుంబం సురేష్ బాబు, రానాలు 9గంటలకు ఫిలింనగర్ సీనీ క్లబ్‌లో ఓటును హక్కును వినియోగించనున్నారు. అదే కేంద్రంలో రాఘవేంద్ర రావు, లక్ష్మీ మంచు గారు 11గంటల సమయంలో ఓటు వేసేందుకు రానున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకధీరుడు రాజమౌళి ఇంటర్నేషనల్ స్కూల్ షెక్ పేట్ పోలింగ్ కేంద్రంలో ఓటును నమోదు చేయనున్నారు. అదేవిధంగా దర్శకుడు శేఖర్ కమ్ముల 8గంటల 30నిమిషాలకు పద్మానగర్‌లోని ఉమ మంటేసోరి స్కూల్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.