ఈ 'మంచి' వైట్‌ ఫుడ్ గురించి మీకు తెలుసా?

 ఈ 'మంచి' వైట్‌ ఫుడ్ గురించి మీకు తెలుసా?

మనిషి జీవించడానికి కావాల్సిన వనరుల్లో ప్రధానమైనది ఆహారం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన తిండి తినాలి. అలా తినాలంటే ముందు ఏది మంచిదో? ఏది కాదో? మనకు తెలియాలి. అంతకంటే ముందు మనం నానారకాల అపోహల నుంచి బయటపడాలి. అన్నం.. నీళ్లు... పప్పు.. కూర... పాలు.. పెరుగు.. ఇలా మన దైనందిన ఆహారాల్లో అనేక రకాలున్నా.. ... ఇందులో ఏది ఎక్కువ?  ఏది తక్కువ తీసుకోవాలి? ఎటువంటి ఆహారం ఆరోగ్యకరం? ఏది హానికరం? ఇలాంటి.. బోలెడు అపోహలు మనకుంటాయి. ముఖ్యంగా తెలుపు రంగులో ఉండే ఆహార పదార్థాలంటే చాలా మంది భయం. డాక్టర్లు కూడా వైట్‌ ఫుడ్‌ను దూరంగా ఉండమంటారు.  పంచదార, ఉప్పు, బియ్యం... ఇటువంటివి కొన్ని మితిమీరి తింటే అనారోగ్యం ఖాయమని, మితంగానే తీసుకోవాలని చాలామంది అంటారు. ఆరోగ్య విషయాల్లో అవగాహన ఉన్నవారు వైట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండమంటారు అందుకే.  కాని మంచి చేసే వైట్‌ ఫుడ్స్‌ కూడా ఉన్నాయి. వీటిల్లో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. అవేంటో చూద్దాం..

వెల్లుల్లి గురించి మన తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అదొక ఔషధమే. మన ఇంట్లో ఉండే ప్రకృతి వైద్య పదార్థాల్లో ఇదొకటి. వెల్లుల్లికి ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్నాయి. వెల్లుల్లిలో బ్యాక్టీరియా, ఫంగల్ నిరోధించే గుణాలున్నాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్లకు వ్యాధులపై పోరాడే శక్తి ఉంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి వెల్లుల్లి సహాయపడుతుంది.జలుబు నివారణకు ఔషధంగా కూడా వాడుతాం. వెల్లుల్లిలోని అలిసిన్‌, అలిన్‌ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే ఎల్‌డీఎల్‌ కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది వెల్లుల్లి. వెల్లుల్లి వంటల్లో వాడే ముందు... వెల్లుల్లి రెబ్బల పొట్టును తొలగించి వాటిని ముక్కలుగా కోసి ఓ పది నిమిషాల పాటు ఉంచాక వాడాలి. దీనివల్ల వీటి ప్రభావాన్ని గరిష్ఠంగా పొందొచ్చు.

ఈరోజుల్లో ఎక్కువమంది బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్న ఓట్‌ మీల్‌... గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సిన పీచు పదార్థాన్ని ఓట్‌ మీల్‌ అందిస్తుంది. శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను ఈ పీచు పదార్థాం కరిగిస్తుంది. పీచు పదార్థాలుంటే ఆహారంతో కొన్ని రకాల కేన్సర్లు కూడా తగ్గుతాయంటున్నారు వైద్యులు.

పుట్ట గొడుగులను మనం ఓ వంటగానే చూస్తాం కాని.. ఆసియా దేశాల్లో దీన్ని ఓ ఆహార పదార్థంగానే కాక.. ఓ ఔషధంగా భావిస్తారు. ఎందుకంటే ఇందులో లభించే న్యూట్రియంట్స్‌ ఇతర ఆహార పదార్థాల్లో లభించవు.  పోటాషియం, బి-విటమిన్లు‌, యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం, ఫోలేట్ వంటి పోష‌కాలు వీటిలో స‌మృద్ధిగా ఉంటాయి.  వండేటపుడు ఇవన్నీ రిలీజ్‌ అవుతాయి. పుట్టగొడుగులు తరచూ తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త నాళాల్లో ఉండే కొవ్వు క‌రిగిపోతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు.

పగలంతా పని ఒత్తిడితో సతమతమయ్యే వారు నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే హాయిగా నిద్రపడుతుంది. మెదడును కూడా ఆహ్లాదపరుస్తుంది. పాలలో ఉండే కాల్షియం వల్ల పిల్లల్లో ఎముకల ధ్రుడత్వానికి, వారి పెరుగుదలకు దోహదపడుతుంది. పాలలో ఉండే విటమిన్‌ 'డి' శరీర కండరాలు పెరగడానికి, బలంగా రావడానికి ఉపయోగపడుతుంది. పెద్దల్లో ఆస్టియోపోరోసిస్‌ వంటి జబ్బులు తలెత్తకుండా ఉంటాయి.  

కాలిఫ్లవర్‌లో విటమిన్- సి, ఫోలేట్, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. విష పదార్థాల వల్ల కిడ్నీలకు జరిగే నష్టాన్ని నివారించడంలో కాలిఫ్లవర్‌లోని ఔషధ గుణాలు మెరుగ్గా పనిచేస్తాయి. చిన్న కప్పుడు కాలిఫ్లవర్‌ కూర తింటే.. శరీరానికి ఒక రోజులో కవాల్సిన విటమిన్‌-సిలో మూడో వంతు అందుతుందని నిపుణుల చెబుతున్నారు. కాలిఫ్లవర్‌ను ఉడకబెట్టే కంటే ఆవిరి పట్టించి తింటే.. అందులోని పోషకాలు బయటకుపోకుండా ఉంటాయని అంటున్నారు నిపుణులు. కాలిఫ్లవర్‌కు కాసింత పసుపు జోడిస్తే మరింత మంచిదట.

వివిధ దేశాల్లో పెరుగును రకరకాల రుచులతో, రంగులతో చేస్తారు.  నీటిశాతం లేకుండా మృదువైన క్రీమ్‌లా ఉండేలా కూడా పెరుగును తయారుచేస్తారు. మనకు ఆ సమస్య లేదు. చిన్నప్పటి నుంచి గడ్డ పెరుగు అలవాటు చేస్తారు. పెరుగులో కాల్షియం, ప్రొటీన్‌ శాతం ఎక్కువ. జీర్ణ ప్రక్రియ మెరుగుపర్చడానికి, రోగ నిరోధక శక్తి పెరుగుదలకు, మధుమేహం నియంత్రకు సహాయపడే ప్రోబయోటిక్స్‌ను.. పెరుగు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  

మనం రోజువారీ ఉపయోగించే కూరల్లో బంగాళ దుంప ఒకటి. ముఖ్యంగా తెల్లటి బంగాళదుంపల్లో పీచు పదార్థాలు, విటమిట్‌-సి పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఒక మాదిరి సైజులోని దుంపలో 4 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. ఒక వ్యక్తికి రోజుకు అవసరమయ్యే విటమిన్‌-సిలో 70 శాతం, విటమిన్‌-బి6లో 30 శాతాన్ని ఒక దుంప తింటే పొందవచ్చని అంటున్నారు వైద్యులు. ఈ రకం దుంపల్లో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయట.

మనం స్నాక్స్‌గా ఎక్కువగా తినే పాప్‌కార్న్‌.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా ఇందులో అతితక్కువ మోతాదులో కేలరీలుండడంతో ఎంత తిన్నా ఫర్వాలేదని వైద్యులు అంటున్నారు. ఒక కప్పు పాప్‌కార్న్‌లో కేవలం 30 కేలరీలే ఉంటాయట. ఒక కప్పు పాప్‌కార్న్‌కు కాసింత వెన్న జోడిస్తే 80 కేలరీలు సమకూరుతాయని.. ఇటువంటివి 3 కప్పులు తింటే రోజుకు అవసరమైన తృణధాన్యాలు తీసుకున్నట్టేనని చెబుతున్నారు. ఐతే.. షాపుల్లో కొనే పాప్‌కార్న్‌లో కెమికల్స్ ఉండే ప్రమాదం ఉన్నందున ఇంట్లోనే పాప్‌కార్న్‌ తయారు చేసుకోవడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు.  

ఒకప్పుడు ఇవి మనకు అందుబాటులో ఉండేవి కావు. ఈ కామర్స్‌ వెబ్‌సైట్లు, మాల్స్‌ వచ్చిన తరవాత ఇవి కూడా ఇపుడు సుమారిపాటి పట్టణాల్లో కూడా లభిస్తున్నాయి. తక్కువ కేటరీలకే అధిక న్యూట్రీషియన్స్‌ లభిస్తాయి. ఇంకా ఫైబర్‌, విటమిన్‌ ఈ, కాల్షయం, పొటాషియం, మెగ్నీషియం, బి విలమిన్స్ కూడా లభిస్తాయి. కంప్లీట్‌ ప్రొటీన్‌కు ఇది మంచి ఉదాహరణ. పైగా అవసరమైన అమినో యాసిడ్స్‌ కూడా లభిస్తాయి.  వృద్ధాప్యం తొందరగా రాకుండా ఆపడమే గాకుండా.. కేన్సర్‌ను దూరంగా ఉంచే వాటిల్లో ఇదొకటి.