ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం.. వివరాలు ఇవీ..

ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం.. వివరాలు ఇవీ..

ప్రస్తుతం రాష్ట్రం రూ.66వేల కోట్ల ఆర్థిక లోటులో ఉందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. విభజన నాటికి రూ.20వేల కోట్ల ఆర్థికలోటులోనే ఉన్నా గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా అప్పులు చేసి వ్యయాన్ని వృథా చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన ఇవాళ శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య ఏపీకి గడ్డు కాలం నడిచిందని.. జాతీయసగటుతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి తక్కువగా నమోదైందని చెప్పారు. 

గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయరంగంలో అద్భుత ఫలితాలు వచ్చాయన్నది అవాస్తవమన్నారు. ఫిషరీస్‌ వంటి కొన్ని అనుబంధ రంగాల్లోనే పురోగతి వచ్చిందన్న ఆయన.. గత ఐదేళ్లలో వ్యవసాయరంగం మైనస్‌లలోకి వెళ్లిపోయిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అస్తవ్యస్థమైందని, ఏ రంగంలోనూ పురోగతి లేదని తేల్చారు. అప్పు చేస్తే లాభదాయకంగా ఉండేలా ఖర్చు చేయాలని.. కానీ గత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అనవసర ఖర్చులు చేసిందన్నారు. కాంట్రాక్టుల పేరుతో దోపిడీ చేసేందుకే అనవసర ఖర్చులు చేశారని అన్నారు.