వర్మకు కావాల్సిందే అదే... అందుకే...

వర్మకు కావాల్సిందే అదే... అందుకే...

వర్మ ... ఎలాంటి సినిమా మొదలుపెట్టినా అది వార్తల్లో ఉంటుంది.  రిలీజ్ తరువాత ఆ సినిమా ఎలా ఉంటుంది అనే విషయాన్నీ వర్మ పెద్దగా పట్టించుకోడు.  ఒకప్పుడు వర్మ ఏ సినిమా చేసినా అది సంచలనంగా మారేది.  ఎప్పుడైతే వర్మ రివర్స్ లో ఆలోచించడం మొదలుపెట్టాడా అప్పుడే వర్మ సినిమాలు ఇబ్బందుల్లో పడిపోయాయి.  సంచనల అంశాల మీదనే సినిమాలు చేస్తున్నాడు.  అందుకే విజయం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. 

రీసెంట్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ చేశాడు.  మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా.. కొన్ని కారణాల వలన ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ కాలేదు.  ఏదైతే చెప్పాలని అనుకున్నాడో దానిని స్ట్రెయిట్ గా చెప్పేశాడు.  ప్రభావం మాత్రం పెద్దగా చూపలేకపోయింది.  లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనే విలన్లుగా చూపించే ప్రయత్నం చేశాడు.  ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో మరో ప్రయత్నంగా తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కెసిఆర్ జీవితం ఆధారంగా సినిమా మొదలుపెట్టాడు.  

టైగర్ కెసిఆర్ అని టైటిల్ పెట్టాడు.  మరి ఇందులో విలన్లు ఎవరు.. దీనికి వర్మ ట్వీటే సమాధానం చెప్పింది.  తెలంగాణ వాళ్ళను ఏపి ప్రజలు థర్డ్ క్లాస్ సిటీజన్లుగా చూశారు అని పేర్కొన్నాడు.  అంటే ఏపికి చెందిన నాయకులను విలన్లుగా చూపించబోతున్నారని అర్ధం చేసుకోవాలి.  మరో విషయం ఏమంటే.. ఏపిలో ఏ నాయకులను విలన్లుగా చూపించబోతున్నారు అన్నది తెలియాలి.