ఏంఎస్ ధోని రీల్ హీరో మరణంపై రియల్ ధోని మౌనం... ఇదే కారణమా...!!

ఏంఎస్ ధోని రీల్ హీరో మరణంపై రియల్ ధోని మౌనం... ఇదే కారణమా...!!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంటే గుర్తుకు వచ్చే సినిమా ఏంఎస్ ధోని యాన్ అన్ టోల్డ్ స్టోరీ.  ఈ సినిమా బాలీవుడ్ సినిమా రంగంలో ఓ ఊపు ఊపింది.  సినిమా సూపర్ హిట్ కావడం వెనుక సుశాంత్ సింగ్ నటన ఎంత ఉన్నదో... సుశాంత్ సింగ్ ధోనిలా కనిపించేందుకు క్రికెటర్ ధోని ఇచ్చిన సలహాలు కూడా అంతే ఉన్నాయి.  ఈ సినిమా తరువాత ధోని, సుశాంత్ సింగ్ లు మంచి స్నేహితులయ్యారు.  

ధోని కుటుంబంతో మంచి అనుబంధం ఉన్నది.  ఇద్దరు కలిసి ఈ సినిమా సమయంలో జర్నీ చేశారు.  ఈ సినిమాను ధోని బాగా ప్రమోట్ చేశారు కూడా.  అయితే, సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత అన్ని రకాల చిత్ర పరిశ్రమలు అతని సంతాపం తెలిపాయి.  టాప్ సెలెబ్రిటీలు సుశాంత్ తో తమ అనుబంధం గురించి చెప్తూ సుశాంత్ ఇలా చేస్తాడని అనుకోలేదని చెప్తూ ట్వీట్ చేస్తున్నారు.  దేశ ప్రధాని మోడీ కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ట్వీట్ చేశాడు.  కానీ, ధోని మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.  ఏంఎస్ ధోని సినిమా నిర్మాత సుశాంత్ మరణించిన విషయాన్ని ధోనికి చెప్పగా ధోని నమ్మలేదట.  సుశాంత్ తో ఉన్న అనుబంధం దృష్ట్యా అయన ఇంకా బ్రతికే ఉన్నాడని ధోని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.   పోయినవాళ్ళు తిరిగిరారు.  కష్టమో నష్టమో భరించక తప్పదు.  ఎలాంటి విషయాల్లో స్పందించినా స్పందించకున్నా, ఇలాంటి విషయంలో మాత్రం తప్పకుండా స్పందించాలి. లేదంటే నెగెటివ్ గా అర్ధం చేసుకుంటారు.  రీల్ హీరో ధోనీపై రియల్ హీరో ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.