జీహెచ్ఎంసి మేయర్ ఎన్నిక.. డిప్యూటీ మేయర్ పదవి మీద కూడా టీఆర్ఎస్ కన్ను ?

జీహెచ్ఎంసి మేయర్ ఎన్నిక.. డిప్యూటీ మేయర్ పదవి మీద కూడా టీఆర్ఎస్ కన్ను ?

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కొత్త పాలక వర్గం నేడు కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ప్రమాణిస్వీకారం చేయనుంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు అధికారులు. అవాంచనీయ ఘనటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రక్రియను పూర్తిగా వీడియో తీయించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీచేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 డివిజన్లకు  ఎన్నిక నిర్వహించి.... డిసెంబర్‌లో ఫలితాలు ప్రకటించారు. కొత్త కార్పొరేటర్లు గెలిచినా పదవీ బాధ్యతలు స్వీకరించలేదు. నేటితో పాత పాలకవర్గం కాలం పూర్తయి...నూతన పాలక వర్గం కొలువుదీరనుంది.

సభ్యుల ప్రమాణ స్వీకారానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 10గంటల 30 నిమిషాలలోపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల గుర్తింపును నిర్ధారించుకొని సమావేశ మందిరానికి ఉదయం 11 గంటలలోపు పంపనున్నారు. ఉదయం 11 గంటలకు నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. బీజేపీకి చెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ఒకరు చనిపోవడంతో మొత్తం 149 మంది కార్పొరేటర్లు ఒక్కోక్కరుగా ప్రమాణ స్వీకారం చేచనున్నారు.

అయితే జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకునేందుకు సిద్ధమైంది టీఆర్‌ఎస్‌. కాసేపట్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు భేటీ కానున్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై నేతలు సభ్యులకు దిశా నిర్దేశం  చేస్తారు.  సమావేశం అనంతరం  జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి బస్సుల్లో బయల్దేరుతారు. కేకే, మంత్రులు కేటీఆర్‌, తలసాని గ్రేటర్ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.  సీఎం కేసీఆర్‌ ఇచ్చిన సీల్డ్‌ కవర్‌లో టీఆర్‌ఎస్‌ మేయర్, డిప్యూటీ  మేయర్‌ అభ్యర్తుల పేర్లు ఉన్నాయి. సభ్యులు వీరికే ఓటు వేస్తారు.