మహేష్ సినిమాలో మరో కన్నడ బ్యూటీ..?

మహేష్ సినిమాలో మరో కన్నడ బ్యూటీ..?

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు.  యూఎస్ షెడ్యూల్ ముగిసింది.  ఈ షెడ్యూల్ తరువాత పల్లెటూరి సెట్ లో షూటింగ్ చేయబోతున్నారు.  ఈ షెడ్యూల్ దీపావళి తరువాత ప్రారంభం అవుతుంది. 

మహర్షి సినిమా తరువాత మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతుంది.  2019 మిడిల్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నది.  ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.  మహేష్ - సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అనేదానిపై ఓ క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది.  ఈ సినిమా కోసం ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారు.  అందులో ఒకటి భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా చేసిన కియారా అద్వానీ, మరొకరు గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన. ఈ ఇద్దరి పేర్లు పరిశీలననో ఉన్నట్టుగా తెలుస్తున్నది.  ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది త్వరలోనే తేలిపోతుంది.