రష్మిక.. కియారా.. ఎవర్ని కన్ఫర్మ్ చేస్తారో..?

రష్మిక.. కియారా.. ఎవర్ని కన్ఫర్మ్ చేస్తారో..?

నాపేరు సూర్య తరువాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకొని తన కెరీర్లో బెస్ట్ హిట్స్ ఇచ్చిన గురువు త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.  కథ కూడా ఓకే అయ్యింది.  జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తరహాలో ఇది కూడా ఫాదర్ సెంటిమెంట్ స్టోరీనే అని వినిపిస్తోంది.  కాకపోతే ఇందులో కావలసినంత ఫన్ కూడా ఉంటుందట.  త్వరలోనే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం.  

త్రివిక్రమ్ ఈసారి మార్పును కోరుకుంటున్నాడు.  జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించారు.  ఈసారి దేవిశ్రీ ప్లేస్ లో థమన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.  అరవింద సమేత సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ కు ఇంప్రెస్ అయిన త్రివిక్రమ్, ఈ సినిమాలో కూడా థమన్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడట.  

ఇందులో నటించే హీరోయిన్ల విషయంలో కూడా త్రివిక్రమ్ చాలా పేర్లను పరిశీలించి ఫైనల్ గా కియారా, రష్మిక మందన్న పేర్లను ఫైనల్ చేశారని.  ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.  మరి ఇద్దరిలో బన్నీతో చేసే ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.