మహర్షి 50 రోజుల వేడుక స్పెషల్ గెస్ట్ ఎవరంటే..!!

మహర్షి 50 రోజుల వేడుక స్పెషల్ గెస్ట్ ఎవరంటే..!!

మహేష్ బాబుకు మహర్షి సినిమా మంచి బూస్ట్ ను ఇచ్చింది.  భరత్ అనే నేను తరువాత వరసగా రెండో సినిమా మహర్షి కూడా హిట్ కొట్టడంతో ఆనందంలో ఉన్నాడు మహేష్.  మే 9 వ తేదీన రిలీజైన ఈ సినిమా ఇప్పటికి మంచి వసూళ్లు సాదిస్తున్నది.  కాగా, ఈ సినిమా 50 రోజుల వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని యూనిట్ చూస్తోంది.  

ఈనెల 28 వ తేదీన శిల్పకళా వేదికలో ఈ వేడుకను నిర్వహించబోతున్నారు.  ఈ వేడుకకు మహర్షి సినిమా యూనిట్ అందరూ పాల్గొనబోతున్నట్టు వినికిడి. వీరితో పాటు టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారట.  ఆ గెస్ట్ ఎవరు ఏంటి అన్నది తెలియాలి.