ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంలు వీరే..!?

ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంలు వీరే..!?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌పై తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడాలేని విధంగా తన కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించాలని జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కాపులకు.. ఇలా ఐదు సామాజిక వర్గాల నుంచి ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాలని జగన్ భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే, ఇక ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఎవరు? ఏ సామాజికవర్గం నుంచి ఎవరు? ఎవరు డిప్యూటీ సీఎంల రేస్‌లో ఉన్నారు? అనే ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది. ఎన్టీవీకి అందన సమాచారం ప్రకారం.. ఈ కింద పేర్కొన్న ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి పదవుల రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
1. అంజాద్ బాషా, మైనార్టీ
2. సుచరిత, ఎస్సీ
3. ఆళ్ల నాని, కాపు
4. పార్థసారథి, యాదవ
5. రాజన్నదొర, ఎస్టీ.. డిప్యూటీ సీఎంల రేస్‌లో ఉన్నారు.