ఆర్ఆర్ఆర్ కు సెట్టయ్యే హీరోయిన్స్ ఎవరో..?

ఆర్ఆర్ఆర్ కు సెట్టయ్యే హీరోయిన్స్ ఎవరో..?

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈ సినిమా కోసం సిద్ధంగా ఉన్నారు.  మొదటి పది రోజుల షూట్ ఈ ఇద్దరిపైనే ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరిగింది.  ఇంతవరకు బాగానే ఉన్నది.  రాజమౌళి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, ఆ ముగ్గురిలో ఒకరి విదేశీ హీరోయిన్ అని ప్రచారం జరిగింది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించే ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.  

గతంలో రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా పేర్లు వినిపించాయి.  ప్రస్తుతం వీరికి పాపులారిటీ తగ్గడంతో.. రాజమౌళి వీరిని తీసుకునేది అనుమానమే.  మరోవైపు కాజల్, సమంత, తమన్నా లాంటి హీరోయిన్లు అని కూడా అనుకున్నా, వీరు కూడా పెద్దగా ఫామ్ లో లేరు.  పైగా సమంత ఇప్పటికే నో చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.  పూజా హెగ్డే, కియారా అద్వానీలు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు.  ఈ ఇద్దరు పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లోను బిజీగా ఉండటంతో వీరిని ఈ సినిమాకు తీసుకోవడం కష్టమే అవుతుంది.  రాజమౌళితో సినిమా అంటే మిగతా సినిమాలు చేసేందుకు వీలుపడదు.  దీంతో వీరు ఈ సినిమాలో నటిస్తారా అన్నది సందేహమే.  ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్లు ఎవరు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నకు సమాధానం రాజమౌళి తప్పించి మరెవ్వరు చెప్పలేరు.  ఆయన మనసులో ఎవరునున్నారో చూద్దాం.