మహర్షి... ఆ మెయిన్ గెస్ట్ ఎవరు ?

మహర్షి... ఆ మెయిన్ గెస్ట్ ఎవరు ?

మహేష్ బాబు హీరోగా చేస్తున్న మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1 వ తేదీన భారీ ఎత్తున జరగబోతున్నది.  ఈ వేడుకను అంగరంగ వైభవంగా నెక్లెస్ రోడ్ లో నిర్వహించబోతున్నారు.  ఈ వేడుకలో యూనిట్ తో పాటు ఓ స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నాడట.  ఆ గెస్ట్ ఎవరు అన్నది యూనిట్ సస్పెన్స్ లో పెట్టింది.  

మహేష్ బాబుకు ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు.  అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. భరత్ అనే నేను వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.  ఎల్బీ స్టేడియంలో వేడుక జరిగింది.  మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.  అలాగే, మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ వస్తారని టాక్ వినిపిస్తోంది.  చరణ్ తో పాటు ఎన్టీఆర్ ను కూడా ఈ వేడుకకు పిలుస్తున్నారని సమాచారం.  ఇదే నిజమైతే.. ఇండస్ట్రీలో టాప్ హీరోలు ముగ్గురిని ఒకే వేదికపై చూడొచ్చు.