చిరు చందమామ వైపే మొగ్గుచూపుతున్నాడా?

చిరు చందమామ వైపే మొగ్గుచూపుతున్నాడా?

మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా సైరా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆగస్ట్ నెలలో సినిమాకు సంబంధించిన కీలకమైన ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ తో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు కూడా వచ్చే నెలలో సైరా టీమ్ అనౌన్స్ చేయబోతున్నది.  మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22 వ తేదీన తన కొత్త సినిమా అనౌన్స్ చేయబోతున్నారు.  

మెగాస్టార్ కోసం కొరటాల శివ సంవత్సరం కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.  ఆగస్టు 22 న లాంఛనంగా ప్రారంభించి సినిమాను నవంబర్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరు దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీకి రాలేదు.  అనేక పేర్లు తెరమీదకు వస్తున్నాయి.  సైరాలో చిరుతో కలిసి నటించిన నయనతారను మొదట అనుకున్నారు.  కానీ, ఆమె బిజీ కారణంగా పక్కన పెట్టారని సమాచారం.  ఐష్ ను అనుకున్నా ఆమె రెమ్యునరేషన్ ఇతర ఖర్చులు మొత్తం కలిపి ఎక్కువౌతుండటంతో ఐష్ ను కూడా పక్కన పెట్టారని సమాచారం.  మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమాలో చేసిన కాజల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.  ఆ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది.  సినిమా బంపర్ హిట్టైంది.  సో, ఇప్పుడు మరలా ఆ కాంబినేషన్ ను సెట్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.