ఎఫ్ 3 లో ఆ మూడో స్టార్ ఎవరంటే...!!

ఎఫ్ 3 లో ఆ మూడో స్టార్ ఎవరంటే...!!

2019 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా ఎఫ్ 2.  ఈ సినిమా దిల్ రాజుకు భారీ లాభాలు తీసుకొచ్చింది.  సినిమాకు పక్కా ఫన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు అదరగొట్టారు.  సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫన్ క్రియేట్ కావడంతో మస్త్ హిట్ కొట్టింది.  కాగా, అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తామని దిల్ రాజు చెప్పారు.  చెప్పినట్టుగానే సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారని సమాచారం. 

అనిల్ రావిపూడి ఈ సినిమా తరువాత సరిలేరు సినిమా చేశారు.  ఇది మంచి వసూళ్లు రాబట్టింది.మహేష్ బాబుతో మరో సినిమా ఉంటుందని ప్రకటించారు.  ఈ మధ్యలో అనిల్ మరో సినిమా చేయబోతున్నారు.  అదే ఎఫ్ 3.  దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ను అనిల్ రెడీ చేస్తున్నారట.  ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటుగా మరో స్టార్ కూడా ఉండబోతున్నారట.  ఆయన ఎవరో కాదు... మాస్ మహారాజ రవితేజ అంటున్నారు.  అయితే, దీనిని కన్ఫర్మ్ చేయాల్సి ఉన్నది.