ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలో విలన్ ఎవరంటే..!!

ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలో విలన్ ఎవరంటే..!!

ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టిస్టారర్ సినిమా నవంబర్ 18 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.  నవంబర్ మొదటి వారంలో పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి నవంబర్ 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే అవకాశం కనిపిస్తున్నది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారనే విషయం బయటకు వచ్చింది.  పీరియాడికల్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ ఎవరు అనే దానిపై ఇప్పటి వరకు యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.  నటీనటుల వివరాలను చాలా గోప్యంగా ఉంచుతున్నది యూనిట్. 

చరణ్ లేదా ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరో ఒకరు విలన్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తున్నది.  వీరితో పాటు టాలీవుడ్ లేదా బాలీవుడ్ కు చెందిన ఓ హీరో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడని సమాచారం అందుతున్నది.  ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగకతప్పదు.