కరోనాపై డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన..

కరోనాపై డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన..

కరోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి ఇప్పుడ‌ప్పుడే త‌గ్గే అవ‌కాశాలు లేవ‌ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రక‌టించింది. ఈ ఏడాది చివరికల్లా క‌రోనా విస్తృతి ఆగిపోతుంద‌ను కోవ‌డం అత్యాశే అవుతుంద‌ని తెలిపింది. అలాంటి ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేసింది. సమర్థవంతమైన కరోనా టీకాలవల్ల మరణాలు, ఆస్పతుల పాల‌య్యేవారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్‌ కట్టడికి టీకాలు తోడ్పడుతున్నాయని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. ఆల‌స్యంగానైనా కోవిడ్‌ వ్యాప్తిని నియంత్రిస్తామన్న విశ్వాసం ఉంద‌న్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందని, అయితే రూపాంత‌రం చెందుతున్న వైరస్ ర‌కాలు‌ ప్రమాదకారిగా మారే అవకాశముందని హెచ్చరించింది. కాగా, తగ్గినట్టే తగ్గి.. మళ్లీ కరోనా కేసులు పెరగడంలో ఆందోళన మొదలైంది.. మరోవైపు.. భారత్ లో మరణాల క్రమంగా తగ్గిపోవడం శుభ పరిణామంగా చెబుతున్నారు అధికారులు.