హిందీ క్రాక్‌లో హీరో ఎవరు..?

హిందీ క్రాక్‌లో హీరో ఎవరు..?

మాస్ మహరాజ్ రవితేజ తాజా చిత్రం క్రాక్ భారీ వసూళ్లు చేసి సంక్రాంతి అల్లుడు అనిపించుకున్నాడు.  ఈసినిమా ఊహించని స్థాయిలో వసూళ్లను చేసింది. విడుదల రోజున కాస్త ఆలస్యం అయినా చివరికి మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయాలిన చూస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరో ఎవరు చేస్తారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. మొదట ఈ సినిమాను హిందీలో రియల్ హీరో సోనూసూద్ హీరోగా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కాని ప్రస్తుతం మాత్రం ఈ సినిమా చేయనున్న హీరోలుగా కేవలం ముగ్గురి పేర్లే వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు రీమేక్ సినిమాలు చేసి వాటిలో ఒకటి భారీ హిట్ అందుకున్న షాహిద్ కపూర్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్‌లు ఈ రేసులో ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో క్రాక్ సినిమాను హిందీలో ఎవరు చేస్తారన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమాను హిందీలో కూడా గోపీచంద్ మలినేని చేయనున్నాడట. అయితే బాలీవుడ్‌లో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా తెలుగులో పవర్ ఫుల్ మాస్ మసాలా సినిమాగా తెరకెక్కింది. అదే స్థాయిలో ప్రజాదరణ కూడా పొందింది. మరి ఈ సినిమా హిందీలో ఏమాత్రం ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ముందుగా ఈ సినిమా హిందీ రీమేక్‌లో ఈ ముగ్గురిలో ఒక హీరో చేస్తాడా లేకుండా వేరే హీరోకి అవకాశం వస్తుందా అన్న సందేహాలు కూడా రాకపోలేదు. మరి దీనిపై క్లారిటీ కోసం వేచి చూడాల్సిందే.