యాత్రలో జగన్ రోల్ ను ఎవరు చేస్తున్నారో తెలుసా..?

యాత్రలో జగన్ రోల్ ను ఎవరు చేస్తున్నారో తెలుసా..?

వైఎస్సాఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా యాత్ర. వైఎస్సాఆర్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటుస్తున్నాడు.  మహి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది.  ఇదిలా ఉంటె, వైఎస్సాఆర్ జీవితంలో జగన్ పాత్ర కీలకం.  తనయుడిగానే కాకుండా, రాజకీయ నాయకుడిగా కూడా జగన్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు.  ఈ పాత్ర కీలకం కాబట్టి టాలీవుడ్, కోలీవుడ్ లోని టాప్ నటుల్లో ఒకరిని సెలెక్ట్ చేయాలని మహి అండ్ కో అనుకున్నది.  అనేక పేర్లను పరిశీలించిన తరువాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను కలిశారు.  

సూర్యకు పాత్ర నచ్చినప్పటికీ.. బిజీ షెడ్యూల్ కారణంగా సున్నితంగా తిరస్కరించి.. ఆ పాత్రను తమ్ముడు కార్తీకి ఆఫర్ చేశాడట.  యాత్రలో జగన్ రోల్ చిన్నదే అయినప్పటికీ.. పవర్ ఫుల్ రోల్ కావడం.. పైగా అన్న సూర్య రికమండ్ చేయడంతో కార్తీ వెంటనే ఒప్పేసుకున్నాడు.  ప్రస్తుతం కార్తీ.. కడైకుట్టి సింగం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.  ప్రమోషన్స్ పూర్తికాగానే యాత్ర సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.  ఇదిలా ఉంటె, యాత్రలో మరో పవర్ ఫుల్ రోల్ వైఎస్సాఆర్ కూతురు షర్మిల.  షర్మిల పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉన్నది.