ఇస్మార్ట్ శంకర్ ను ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ?

ఇస్మార్ట్ శంకర్ ను ఎవరు డిస్ట్రిబ్యూట్  చేస్తున్నారు ?

ఇస్మార్ట్ శంకర్ మూవీ ఈనెల 18 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సినిమా జులై 12 న రిలీజ్ కావాల్సి ఉన్నా.. జులై 14 వ తేదీన వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతో.. వాయిదా వేశారు.  ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ట్రైలర్ కు మిశ్రమ స్పందన వచ్చింది.  ఈ స్పందన సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.  

పైగా సాంగ్స్ కూడా యావరేజ్ టాక్ రావడంతో సినిమాను ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు అనే దాని చుట్టూ వస్తున్న వార్తలపై ఆసక్తి నెలకొంది.  పూరి, ఛార్మిలు సినిమాకు అనుకున్నంతగా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరగకపోవడంతో దిల్ రాజును సంప్రదించినట్టు సమాచారం.  ప్రస్తుతం దిల్ రాజు ఫుల్ బిజీగా ఉన్నారు.  వరసగా పెద్ద సినిమాలు నిర్మిస్తూ.. డిస్ట్రిబ్యూషన్ బిజీగా ఉండటం వలన ఇస్మార్ట్ శంకర్ ను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు నో చెప్పినట్టు తెలుస్తోంది.  సినిమా రిలీజ్ కు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎవరు లేకుంటే సొంతంగా సినిమాను రిలీజ్ చేయాలని పూరి అండ్ కో అనుకుంటున్నట్టు సమాచారం.