హరీష్.. కేటీఆర్ .. అవకాశం ఎవరికి..!!?

హరీష్.. కేటీఆర్ .. అవకాశం ఎవరికి..!!?

తెలంగాణాలో నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేయబోతున్నారు.  వీటితో పాటు కేబినెట్ విస్తరణ కూడా జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  దసరా సమయంలో ఈ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  నామినేటెడ్, కేబినెట్ పదవుల కోసం చాలా పెద్ద క్యూ ఉన్నది.  చాలామంది నేతలు ఆ పదవుల కోసం లాబీయింగ్ జరుపుతున్నారు.  

గత ఎన్నికల్లో ఓటమిపాలైన వినోద్ కు ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా పదవి లభించింది.  అలానే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన హరీష్ రావు, కేటీఆర్, జోగు రామన్న, లక్ష్మారెడ్డి తరుతరులకు కేబినెట్ పదవులు ఇవ్వలేదు.  వీరికి విస్తరణలో పదవులు లభించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.  అయితే, కేటీఆర్, హరీష్ రావులలో ఎవరికి పదవులు దక్కే అవకాశం ఉన్నది అన్నది తేలాల్సిన అంశం.