రాజు రవితేజ తర్వాత ఎవరు ?

రాజు రవితేజ తర్వాత ఎవరు ?


పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టిన రోజు నుండి అందరి నోట రాజు రవితేజ అనే పేరు వినిపిస్తుంది. అంతేకాదు పవన్ కళ్యాణే స్వయంగా.. ‘జనసేన’ పార్టీ పెట్టిన మొదట్లో ? నా వెనుక ఎవరూ లేరు... ఒక్క రాజు రవితేజ తప్ప”అని స్వయంగా పవన్ కళ్యాణ్ పేర్కొనడంతో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన పవన్ వరుస కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే మరోపక్క పార్టీ నుంచి జనసైనికులు ఒక్కరొక్కరే తప్పుకుంటున్నారు. కొందరు నేరుగా పార్టీకి దూరమైతే మరికొందరు పరోక్షంగా పార్టీకి దూరమైపోతున్నారు. ఆరు రోజుల రాయలసీమ పర్యటన, నాలుగు రోజుల పాటు గోదావరి జిల్లాల పర్యటన ఆ తర్వాత కాకినాడలో దీక్షతో పార్టీకి కొత్త ఊపు వస్తుందనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా మారుతోంది.

రాయలసీమ పర్యటనలో పవన్ కల్యాణ్ ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా గళమెత్తితే.. ఆయన పార్టీకి వున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంకు మద్దతు పలికారు. ఆ తర్వాత కాకినాడలో పవన్ కల్యాణ్ రైతు సమస్యలపై ఒక రోజు నిరాహార దీక్ష చేస్తే.. ఆ మర్నాడే పవన్ కల్యాణ్‌కు సన్నిహితునిగా పేరున్న రాజు రవితేజ పార్టీని వీడారు. ఇప్పుడు తర్వాత ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. త్వరలో పవన్ కల్యాణ్‌ తర్వాత అంతే కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా పార్టీకి దూరమయ్యేలా వున్నారని పార్టీ వర్గాల గుసగుసలు. అయితే జేడీ లక్ష్మీ నారాయణ కూడా పార్టీ వీదతారు అనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏమవుతుందో ?