దగ్గుబాటి పాత్రలో నటిస్తుంది ఎవరో తెలుసా..?

దగ్గుబాటి పాత్రలో నటిస్తుంది ఎవరో తెలుసా..?

భారీ తారాగణంతో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్నది.  ఈ సినిమాకు సంబంధించి రోజుకొక కొత్త అప్డేట్ బయటకు వస్తున్నది.  ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.  

ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై నిన్నటి వరకు క్లారిటీ లేదు.  ఈ పాత్ర విషయంలో నిర్మాత, నటుడు బాలకృష్ణ కూడా పెద్దగా దృష్టి సారించలేదు.  ఎంపిక విషయాన్ని క్రిష్ కే అప్పగించినట్టు సమాచారం.  ఈ పాత్రకోసం క్రిష్ డాక్టర్ భరత్ రెడ్డిని ఎంపిక చేశారు.  ఇప్పటికే పలు సినిమాల్లో భరత్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేశారు.  దగ్గుబాటి రోల్ కు కరెక్ట్ గా సరిపోతారని చెప్పి ఆయనను ఎంపిక చేశారట.