చెన్నై ని రాజస్థాన్ ఆపగలదా..?

చెన్నై ని రాజస్థాన్ ఆపగలదా..?

అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఐపీఎల్ 2020 ప్రారంభమైంది. అయితే కరోనా కష్టకాలంలో ప్రారంభమైన ఈ ఏడాది ఐపీఎల్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఎటువంటి కరోనా సమస్య లేకుండా పూర్తయ్యాయి. ఇక ఈ రోజు ఈ లీగ్ లో నాలుగో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్యలో జరగనుంది. అయితే ఈ టోర్నీలో రాజస్థాన్ కు ఇదే మొదటి మ్యాచ్ కాగా చెన్నై కి మాత్రం ఇది రెండో మ్యాచ్. తమ మొదటి మ్యాచ్ లీగ్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ తో ఆడి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా జడేజా, సామ్ కర్రన్ వంటి ఆల్ రౌండర్లను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపించి అందరికి షాక్ ఇచ్చాడు ధోని. చెన్నై జట్టులో రైనా, హర్భజన్ వంటి ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్ కు దూరం అయిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించి తమ జట్టు సత్తా నిరూపించుకుంది. ఇక తలకు బాల్ తగలడంతో ఇంగ్లాడ్ తో వన్డే సిరీస్ కు పూర్తిగా దూరమైన స్టీవ్ స్మిత్ ఈ ఏడాది ఐపీఎల్ లో ఆడుతాడా అనే అనుమానం అందరిలో వచ్చింది. కానీ ఆ స్టార్ ఆటగాడు వస్తున్నట్లు తెలిపి తమ అభిమానులను గుడ్ న్యూస్ అందించింది రాజస్థాన్ జట్టు యాజమాన్యం. ఇక రాజస్థాన్ జట్టులో మరో కీలక ఆటగాడు అయిన బెన్ స్టోక్స్ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల దూరం కావడం జట్టుకు పెద్ద నష్టమే. అయితే మొదటి విజయం తో దూకుడు మీద ఉన్న చెన్నై ని రాజస్థాన్ ఆపగలదా... లేదా అనేది అలాగే ఈ రెండు జట్లలో ఉన్న బలాలు, బలహీనతలు ఏంటి అనేది తెలియాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.