సమ్మర్ విజేత ఎవరో..?

సమ్మర్ విజేత ఎవరో..?

వింటర్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది.  ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతున్నాయి. మార్చి నుంచి ఎండ మొదలౌతుంది.  ఎండతో పాటు టాలీవుడ్ లో సినిమాల హడావుడి మొదలౌబోతున్నది.  మార్చి 1 వ తేదీ నుంచి వరసగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  మర్చి 1 వ తేదీన 118 సినిమా రిలీజ్ కాబోతుండగా.. మార్చి 21 వ తేదీన ఏబీసీడీ సినిమా రిలీజ్ అవుతున్నది.  అలాగే మార్చి 29 వ తేదీన నిహారిక సూర్యకాంతం, నిఖిల్ అర్జున్ సురవరం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  ఇవన్నీ మీడియం రేంజ్ సినిమాలే.  వీటితో పాటు మార్చి నెలలో మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.  

మార్చి నెల అంటే పరీక్షల కాలం.  విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు.  కాబట్టి సినిమాలపై పెద్దగా శ్రద్ధపెట్టరు.  అందుకే ఈ సమయంలో పెద్ద సినిమాలు పెద్దగా రిలీజ్ కావు.  ఈ టైమ్ ను చిన్న, మీడియం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.  ఇక ఏప్రిల్ నెలలో కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  మొదటగా ఏప్రిల్ 5 వ తేదీన నాగచైతన్య మజిలీ రిలీజ్ అవుతున్నది.  రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  పెళ్ళైన తరువాత నాగ చైతన్య.. సమంతలు కలిసి నటిస్తున్న సినిమా మజిలీ కావడం విశేషం.  

మజిలీ తరువాత ఏప్రిల్ 12 వ తేదీన రెండు సినిమాలు పోటీ పడబోతున్నాయి.  అందులో ఒకటి సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి కాగా, రెండో సినిమా సూర్య ఎన్.జీ.కే.  వరస ప్లాప్ లతో సతమతం అవుతున్న సాయి ధరమ్ తేజ్, ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.  ఇక సూర్య పొలిటికల్ థ్రిల్లర్ ఎన్.జీ.కే కూడా అదే రోజున రిలీజ్ అవుతున్నది.  ఫిబ్రవరి 14 వ తేదీన సూర్య టీజర్ రిలీజ్ అయ్యింది.  భారీ రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగాయి.  తెలుగులో సూర్యకు మంచి మార్కెట్ ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.  

ఇక ఏప్రిల్ 18 వ తేదీన నాని జెర్సీ రిలీజ్ అవుతుంటే.. 19 వ తేదీన రాఘవ లారెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ కాంచనా 3 రిలీజ్ అవుతున్నది.  ఇవి రిలీజ్ అయినా వారానికి మహేష్ బాబు మహర్షి రిలీజ్ అవుతుంది.  ఏప్రిల్ 25 వ తేదీన మహేష్ మహర్షి విడుదలౌతుంది.  భరత్ అనే నేను తరువాత చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి.  ముగ్గురు నిర్మాతలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమాకోసం తెలుగు రాష్ట్రాల్లోని 80% థియేటర్లు బుక్ అయినట్టు సమాచారం.  మరి ఈ సమ్మర్ విజేత ఎవరో తెలియాలంటే మే వరకు ఆగాల్సిందే.