సుభాష్ కపూర్ పై ఆరోపణలు.. సినిమా తప్పుకున్న అమీర్ ఖాన్

సుభాష్ కపూర్ పై ఆరోపణలు.. సినిమా తప్పుకున్న అమీర్ ఖాన్

బాలీవుడ్ ను మీటు వ్యవహారం కుదిపేస్తున్నది.  తనూశ్రీ దత్త మొదటిసారిగా బాలీవుడ్ లో ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడటంతో.. మిగతా తారలు ఒక్కొక్కరిగా బయటకి వస్తున్నారు.  లైంగికంగా తమను వేధిస్తున్నారంటూ మండిపడుతున్నారు.  దీంతో మీటు ఉద్యమం ఊపందుకుంది.  ఈ ఉద్యమం సెగ ఇప్పుడు అమీర్ ఖాన్ సినిమాను తాకింది.  

భూషణ్ కుమార్.. అమీర్ ఖాన్ సంయుక్తంగా గుల్షన్ కుమార్ జీవిత కథ ఆధారంగా మొఘల్ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు సుభాష్ కపూర్ దర్శకుడు.  కాగా, ఈ దర్శకుడిపై గీతికా అనే నటి ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా వేడెక్కింది.  ఓ పార్టీలో సుభాష్ కుమార్ తనపై అనుచితంగా ప్రవర్తించాడంటూ గీతక కేసు ఫైల్ చేసింది.  సుభాష్ పై ఆరోపణలు రావడంతో ఈ సినిమా నిర్మాణం నుంచి తప్పుకుంటున్నట్టు అమీర్ ఖాన్ ప్రకటించారు.