ఈ ఫోటో వెనుక ఆంతర్యం ఏంటో..!!?

ఈ ఫోటో వెనుక ఆంతర్యం ఏంటో..!!?

తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో యువత గుండెలను దోచుకున్న ఆదాశర్మ.. ఆ సినిమా తరువాత టాలీవుడ్ లో రెండు మూడు సినిమాల్లో మెరిసింది.  ఇక్కడ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టింది.  ఏవో చిన్న చిన్న ఆఫర్లు వస్తున్నాయి చేస్తున్నది.  ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఫోటో షూట్ లకు హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చే ఈ క్యూట్ బేబీ హఠాత్తుగా రోడ్డుపక్కన కూరగాయలు అమ్ముతూ కనిపించింది. 

ఆదాశర్మను అలా చూసేసరికి బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది.  ఆదాశర్మకు ఏమైంది.  ఎందుకు రోడ్డుపక్కన కూరగాయలు అమ్ముకుంటుందనే అనుమానాలు పెరిగాయి.  సాధారణ జనాలు కూడా దీనిపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.  అవకాశాలు లేకపోతే ఇలా రోడ్డుపక్కన కూరగాయలు అమ్ముకోవడం ఏంటని కొందరు ప్రశిస్తున్నారు. 

అదాశర్మ రోడ్డుపక్కన కూరగాయలు అమ్మడానికి అసలు కారణం ఏంటో తెలిస్తే అంతా షాక్ అవుతారు. ఆదాశర్మకు హాలీవుడ్ లో అవకాశం వచ్చింది.  ఆ సినిమా కోసం డీ గ్లామరైజ్ గా ఉండేందుకు ఫోటో షూట్ నిర్వహించారట.  ఆ ఫోటో షూట్ లో భాగమే ఈ ఫోటో అంటున్నారు.  రోడ్డుపక్కన కూరగాయలు అమ్ముతూ హాలీవుడ్ లో అవకాశం సంపాదించిందన్నమాట.