ఆ సినిమాలో నాగ్ హీరోయిన్ గా శ్రీదేవిని వద్దన్నాడట..!!

ఆ సినిమాలో నాగ్ హీరోయిన్ గా శ్రీదేవిని వద్దన్నాడట..!!

నాగార్జున దేవదాస్ గురువారం రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  ఈ సినిమా కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  దేవదాస్ పేరుతో వచ్చిన సినిమాలు దాదాపుగా అన్ని హిట్ అయ్యాయి.  హిట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కూడా అదే విధంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు.  

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.  నాగార్జున వైజయంతి మూవీస్ లో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశారు.  దేవదాస్ ఐదొవ సినిమా.  వైజయంతి మూవీస్ గురించి చెప్తూ కొన్ని సీక్రెట్స్ ను రివీల్ చేశాడు.  

వైజయంతి మూవీస్ లో మొదటి సినిమా ఆఖరి పోరాటం.  ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి  చేస్తున్నదని చెప్పినపుడు నాగార్జున భయపడ్డాడట.  శ్రీదేవి అప్పటికే స్టార్ హీరోయిన్.  చాలా సినిమాలు చేసింది.  ఎన్టీఆర్, నాగేశ్వర రావులతో నటించింది.  ఆఖరి పోరాటం కంటే ముందు నాగార్జున చేసింది కొన్ని సినిమాలే.  సన్నగా ఉంటాడనే టాక్ ఉంది.  డైలాగులు సరిగ్గా చెప్పడం రాదని అంటారు.  అలాంటి హీరో పక్కన శ్రీదేవి అంటే భయం వేసిందట.  శ్రీదేవి నటిస్తే.. క్రెడిట్ మొత్తం ఆమెకే వెళ్తుంది అనే భయం కూడా ఉన్నది.  అందుకే నాగార్జున వద్దని చెప్పాడట.  అశ్విని దత్ నాగేశ్వర రావుని కలిసి మాట్లాడిన తరువాత నాగార్జున ఒప్పుకున్నాడని నాగ్ పేర్కొన్నాడు.  రావోయి చందమామ తరువాత చేస్తున్న సినిమా కావడంతో దీనిపై నమ్మకంతో ఉన్నట్టుగా నాగార్జున పేర్కొన్నాడు.