అప్పుడు అలా కనిపించాడు... ఇప్పుడు ఇలా కనిపిస్తాడా?

అప్పుడు అలా కనిపించాడు... ఇప్పుడు ఇలా కనిపిస్తాడా?

బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో ఓ మాస్ హీరో.  ఈ హీరో మాస్ హీరోగా మెప్పించారు.  సినిమా పరంగా చూసుకుంటే ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తున్నారు. అయితే, కొన్ని ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసి మెప్పించిన సంగతి తెలిసిందే.  ఇలాంటి ప్రయాగాత్మక సినిమాల్లో భైరవద్వీపం కూడా ఒకటి.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.  సినిమాపై ఉన్న అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది.  

ఇందులో బాలయ్యను ఒక చోట కురూపిగా చూపించారు.  కథలో ఆ పాత్ర అవసరం కాబట్టి అలా చూపించాల్సి వచ్చింది.  ఈ సినిమాకు ముందు బాలకృష్ణ వరసగా మాస్ సినిమాలు చేశారు.  రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పురవ్వ, బంగారు బుల్లోడు వంటి సినిమాలు చేశారు.  ఈ సినిమాలు అద్బురంగా ఆడాయి.  అదే సమయంలో బాలయ్య భైరవద్వీపం సినిమాలోని పాత్ర చేయడం గొప్ప విషయంగా చెప్పాలి.  

అయితే, ఇప్పుడు బాలకృష్ణ బోయపాటితో సినిమా చేస్తున్నారు. ఇందులో కూడా ఇలాంటి పాత్ర ఒకటి ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  ఇందులో బాలకృష్ణ అఘోరాగా కనిపించబోతున్నారని వినికిడి.  ఆ పాత్రను బోయపాటి ఎలా డిజైన్ చేశారో కూడాలి.  అఘోర అన్నది కేవలం పాత్ర పేరా లేదంటే పాత్ర డిజైన్ కూడా అలా ఉంటుందా చూడాలి.