`బాల‌య్య‌- వినాయ‌క్` ఎందుకీ వాయిదా?

`బాల‌య్య‌- వినాయ‌క్` ఎందుకీ వాయిదా?

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ - వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్ అన‌గానే `చెన్న‌కేశ‌వ‌రెడ్డి` గుర్తొస్తుంది. దాదాపు 15ఏళ్ల క్రితం రిలీజైంది ఈ సినిమా. ఆ త‌ర‌వాత ఈ కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ కానేలేదు. చాలాకాలానికి నిర్మాత సి.క‌ల్యాణ్ చొర‌వ‌తో మ‌రోసారి ఈ కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌నుంద‌ని ఇటీవ‌ల‌ ప్ర‌చారం సాగింది. అన్నీ అనుకూలిస్తే బాల‌య్య‌- వినాయక్ సినిమా ఈపాటికే ప్రారంభం కావాల్సింది. అయితే ప్ర‌తిసారీ ఏదో ఒక అడ్డంకి త‌ప్ప‌డం లేదు. ఈసారి క‌థ అడ్డంకిగా మారింద‌ని తెలుస్తోంది. 

వాస్త‌వానికి క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ `మ‌ఫ్టీ` రీమేక్‌లో న‌టించాల‌న్న‌ది తొలి ప్ర‌పోజ‌ల్‌. ఆ క్ర‌మంలోనే వినాయ‌క్ రీమేక్‌ క‌థ రెడీ చేస్తే న‌చ్చ‌లేద‌ని బాలయ్య తిర‌స్క‌రించార‌ట‌. దానికంటే ఒక స్ట్రెయిట్ క‌థ‌తో రావాల్సిందిగా సూచించార‌ట‌. ప్ర‌స్తుతం వినాయ‌క్ క‌థ కోసం క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య‌బాబు ఎన్టీఆర్‌ బ‌యోపిక్‌పైనే శ్ర‌ద్ధ పెట్టారు. `ఎన్టీఆర్` రిలీజ్ త‌ర‌వాతే వినాయ‌క్‌తో సినిమా ప్రారంభించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. బాల‌కృష్ణ హీరోగా ప‌ర‌మ వీర చ‌క్ర‌, జై సింహా చిత్రాల్ని నిర్మించారు సి.క‌ళ్యాణ్‌. హ్యాట్రిక్ సినిమా కోసం ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే సాంకేతిక కార‌ణాల వ‌ల్ల సినిమా అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది.