కరణ్ జోహార్ పై అర్జున్ కపూర్ సీరియస్..!!

కరణ్ జోహార్ పై అర్జున్ కపూర్ సీరియస్..!!

బాలీవుడ్ సెలెబ్రిటీలతో కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ అనే టాక్ షో చేస్తుండటం తెలిసిందే. సెలబ్రిటీలతో టాక్ షో అంటే దానిపై అందరికి మక్కువ ఉంటుంది.  కరణ్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. వాటికి షోకి వచ్చిన సెలెబ్రిటీలు ఎలాంటి సమాధానం ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంటుంది.  

ఇటీవలే కరణ్ కాఫీ షోకు బాలీవుడ్ సెలెబ్రిటీలు అర్జున్ కపూర్, చెల్లెలు జాన్వీ కపూర్ తో కలిసి వచ్చారు.  ఇద్దరిపై కరణ్ ప్రశ్నల వర్షం కురిపించారట.  అర్జున్ కపూర్ ను డేటింగ్ కు సంబంధించిన ప్రశ్నలు అడగడంతో చాలా ఇబ్బంది పడ్డారట అర్జున్.  సమాధానాలు చెప్పకుండా దాటేస్తున్నా కరణ్ మాత్రం వదలకుండా అడగడంతో ఒకసమయంలో అసహనానికి లోనైన అర్జున్, చెల్లెలు పక్కన ఉంటె ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా అని ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తున్నది.  

కరణ్ అదే విధంగా జాన్వీని కూడా అడగడంతో ఆమె అలాంటివి ఏమి లేవని గట్టిగా చెప్పేసిందట.