రానా సన్నగా మారడానికి కారణం ఇదేనట..!!

 రానా సన్నగా మారడానికి కారణం ఇదేనట..!!

లీడర్ హీరో దగ్గుబాటి రానా బాహుబలి తరువాత దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తరువాత టాలీవుడ్ మొదలు దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.  అటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తనను తాను బిజీ చేసుకున్నాడు.  ఈ బిజీకారణంగా రానా ఆరోగ్యం దెబ్బతిందని రూమర్లు వచ్చాయి.  వీటిని రానా కొట్టిపారేశారు.  ప్రస్తుతం రానా ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబు నాయుడు రోల్ చేస్తున్నారు.  ఈ పాత్రకోసం మరింతగా చిక్కిపోయారు.  దీంతో రానాకు ఏదో అయిపోయిందని వార్తలు రావడం.. అవన్నీ రూమర్లే అని కొట్టి పారెయ్యడంతో కథ సుఖాతం అయింది.  

తెలుగుతో పాటు ఈ హీరో తమిళంలో ధనుష్ తో ఎనై నోకి  పాయుం తోటా, మలయాళంలో మార్తాండవర్మ, కన్నడలో ఎల్టీటీఈ సినిమాలు చేస్తున్నాడు.  అటు బాలీవుడ్ లో హాథీ మేరీ సాథీ సినిమా చేస్తున్నారు.