రజినీకాంత్ తో శివ సినిమా..?

రజినీకాంత్ తో శివ సినిమా..?

రజినీకాంత్ సౌత్ సూపర్ స్టార్.  అందులో తిరుగులేదు.  2పాయింట్ 0, పెట్ట లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మురుగదాస్ తో దర్బార్ మూవీ చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతున్నది.  మురుగదాస్ సినిమా కాబట్టి హైప్ ఉంటుంది.  ఒక బలమైన సబ్జెట్ తో మురుగదాస్ సినిమా చేస్తాడు.  ప్రసుత్తం షూటింగ్ కు బ్రేక్ పడింది.  

దీంతో రజినీకాంత్ చెన్నైలోనే ఉంటున్నాడు.  ఈరోజు చెన్నైలో దర్శకుడు శివతో దాదాపు గంటకు పైగా రజినీకాంత్ చర్చలు జరిపారు.  రజినీకాంత్ ను దర్శకుడు శివ కలిశాడు అనగానే అందరిలోను ఒకటే ప్రశ్న... మురుగదాస్ తరువాత దర్శకుడు శివ తో సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేసి... మరో రెండేళ్లలో తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రజిని సిద్ధం కావాలని అనుకుంటున్నాడు.  సో, మరో ఏడాది తరువాత రజిని సినిమాలకు స్వస్తి పలికి రాజకీయాలకు దగ్గరకావడం ఖాయంగా కనిపిస్తోంది.