చంద్రుని దక్షిణ ధృవమే ఇస్రో లక్ష్యం..ఎందుకంటే..!!

చంద్రుని దక్షిణ ధృవమే ఇస్రో లక్ష్యం..ఎందుకంటే..!!

జులై 22 వ తేదీన ఇస్రో చంద్రయాన్ 2 ను ప్రయోగించింది.  ఈ చంద్రయాన్ 2 సెప్టెంబర్ 7 వ తేదీన చంద్రుని దక్షిణ దృవంపై ల్యాండ్ కాబోతున్నది.  అక్కడ దిగిన తరువాత చంద్రయాన్ 2లో ఉన్న రోవర్ కిందకు వచ్చి ఆ దక్షిణ ధృవంలో పరిశోధన ప్రారంభిస్తుంది.  చంద్రుని దక్షిణ ధృవం మీదకు చేరుకోవాలని అనేక దేశాలు ప్రయత్నం చేశాయి.  దానికోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.  కానీ ఆయా దేశాలకు సాధ్యం కాలేదు.  

మొదటిసారి ఇండియా ప్రయోగించిన చంద్రయాన్ 2 ఆ ఫీట్ సాధించబోతున్నది.  అసలు దక్షిణ దృవాన్నే ఎందుకు ఎంచుకున్నది.. కారణం ఏంటి..? తెలుసుకుందాం.  చంద్రుని దక్షిణ దృవంలో బిలియన్ సంవత్సరాలుగా సూర్యరశ్మి చేరని బిలాలు ఉన్నాయి.  ఈ బిలాల్లో 100 మిలియన్ టన్నుల నీటి నిల్వలు ఉన్నట్టు అంతరిక్ష పరిశోధకులు అంచనా వేస్తున్నారు.  చంద్రుడి ఉపరితల పొరలో హైడ్రోజన్, అమ్మోనియా, మీథేన్‌, సోడియం, మెర్క్యూరీ, వెండి లాంట మూలకాల ఆనవాళ్లు ఉన్నట్లు భావిస్తున్నారు.  ఇది నిజమే అయితే.. భారత్ పరిశోధనలో మరింత ముందడుగు వేసినట్టే అవుతుంది.  భవిష్యత్తులో జరిగే అంతరిక్ష పరిశోధనలకు చంద్రుడిని మజిలీగా చేసుకొని పరిశోధనలు చేయాలని భారత అంతరిక్ష సంస్థ ఆలోచన.  దానికోసమే చంద్రయాన్ 2 ను ప్రయోగించారు.  ఇందులో ఉన్న కెమెరాలు, సెన్సార్లు అందించే సమాచారాన్ని బట్టి పరిశోధన జరగబోతున్నది.