ఆ సినిమా నుంచి కత్రినా తప్పుకోవడానికి కారణం ఇదేనా..?

ఆ సినిమా నుంచి కత్రినా తప్పుకోవడానికి కారణం ఇదేనా..?

2019 లో బాలీవుడ్ అంత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఏబీసీ3డి సినిమా ఒకటి.  డ్యాన్స్ ఫిల్మ్ ఫ్రాంచైసీలో ఇది మూడో సినిమా.  రెండు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.  రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ మెయిన్ రోల్ చేస్తున్నాడు.  వరుణ్ కు డ్యాన్స్ జోడిగా కత్రినా నటిస్తోంది.  ఇది మొన్నటి వరకు ఉన్న సమాచారం.  

తాజా సమాచారం ప్రకారం కత్రినా కైఫ్ ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకుంది. సల్మాన్ ఖాన్ భారత్ సినిమా షెడ్యూల్ కారణంగా ఏబీసీ3డి సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా కత్రినా తెలియజేసింది.  డ్యాన్స్ సినిమా డేట్స్.. భారత్ సినిమా డేట్స్ తో క్లాష్ అవుతున్న కారణంగా తప్పుకుంటున్నట్టు తెలియజేసింది.  అసలు కారణం ఇదేనా లేదంటే వేరే ఏదైనా ఉందా..? 

రెమో డిసౌజా రేస్ 3 సినిమాకు దర్శకత్వం వహించాడు.  ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ పరాజయం పాలైంది.  తాను అనుకున్న స్క్రిప్ట్ వేరని.. కొన్ని కారణాల వలన స్క్రిప్ట్ మార్చాల్సి వచ్చిందని చెప్పడంతో.. సల్మాన్ కు.. రెమో కు మధ్య దూరం పెరిగింది.  ఇప్పుడు కత్రినా రెమో సినిమా నుంచి తప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చన్నది కొందరి అభిప్రాయం.