ధోని ఉంటె నేను ఆ పని చేయాల్సిన అవసరం లేదు : కుల్దీప్

 ధోని ఉంటె నేను ఆ పని చేయాల్సిన అవసరం లేదు : కుల్దీప్

భారతదేశం యొక్క ప్రస్తుత స్పిన్ ద్వయం కుల్దీప్ మరియు యుజ్వేంద్ర చాహల్ యొక్క పెరుగుదలలో మాజీ కెప్టెన్ ధోని కీలక పాత్ర పోషించాడు, మైదానంలో వారికి మార్గనిర్దేశం , స్టంప్ మైక్స్ క్రమం తప్పకుండా వారికి సూచనలు ఇస్తూ ఉంటాడు. అయితే గత ఏడాది ప్రపంచ కప్ నుండి ధోనికి జట్టులో స్థానం దక్కడం లేదు. ఈ విషయం పై కుల్దీప్ మాట్లాడుతూ... నేను అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించే ముందు పిచ్ చదవడం అలవాటు చేసుకోలేదు, కానీ ధోని నా కోసం ఫీల్డ్ సెట్టింగ్ చేయడంతో, నేను నా బౌలింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టగలిగాను. అంతే కాకుండా నేను బంతిని స్పిన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు లేదా నేను పిచ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు లేదా నేను వేగంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ధోని నాకు చెప్పేవాడు. కానీ ఇప్పుడు ధోని లేకుండా ఆడటం కొంచెం కష్టం కానీ అది నాలో మరింత ఆత్మవిశ్వాసం నింపింది . ఎందుకంటే అతను ఉంటె.. నేను ఫీల్డ్ సెట్టింగ్ ‌పై నేను పెద్దగా దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. అతను నా బౌలింగ్ అర్ధం చేసుకొని దానికి తగట్లు ఫీల్డ్ సెట్ చేసేవాడు. కానీ నేను ఇప్పుడు ఆ పని నేర్చుకున్నాను అంటూ  కుల్దీప్ వివరించాడు.