మ‌హాన‌టి త‌మిళ రిలీజ్ ఆల‌స్యం

మ‌హాన‌టి త‌మిళ రిలీజ్ ఆల‌స్యం

సావిత్రి జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కిన `మ‌హాన‌టి` రిలీజ్ ముంగిట ఉన్న సంగ‌తి తెలిసిందే. సెన్సార్ క్లీన్ `యు` స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాలు స‌హా, విదేశాల్లో భారీగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల‌కు ధీటుగా త‌మిళంలోనూ రిలీజ్ చేసేందుకు వైజ‌యంతి మూవీస్ భారీ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. మే 9న తెలుగులో ఈ సినిమా ముందుగా ప్ర‌క‌టించిన‌ట్టే య‌థావిధిగా రిలీజైపోతోంది. ఒక‌రోజు ముందే.. అంటే మే 8న ప్రీమియ‌ర్ల సంద‌డి మొద‌లు కానుంది. ఇక‌పోతే త‌మిళ రిలీజ్ ఎప్పుడు? అన్న‌దానికి స‌రైన ఆన్స‌ర్ లేదు ఇంత‌వ‌ర‌కూ. 

`మ‌హాన‌టి` త‌మిళ‌నాడు రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతోంద‌న్న‌ది తాజా అప్‌డేట్‌. 9న తెలుగులో, 11న త‌మిళంలో రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. న‌డిగ‌ర తిల‌గంలో కొన్ని ప‌నులు ఆల‌స్యం అవ్వ‌డం వ‌ల్ల‌నే ఈ వాయిదా అని తెలుస్తోంది. రెండ్రోజులు ఆల‌స్య‌మైనా.. జెమిని గ‌ణేష‌న్, సావిత్రి అభిమానులు ఈ సినిమాని వీక్షించేందుకు ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో, త‌మిళ‌నాడులో ఏ స్థాయిలో ప్ర‌భావం చూపిస్తుంది?  బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది? అన్న క్యూరియాసిటీ అంత‌కంత‌కు రెయిజ్ అవుతోంది.