మహానాయకుడు మరింత ఆలస్యం.. కారణం..!!

మహానాయకుడు మరింత ఆలస్యం.. కారణం..!!

ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.  ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9 న రిలీజ్ అయింది.  ఈ సినిమా బాగుందని టాక్ వచ్చినా.. అనుకున్నంతగా వసూళ్లు రాకపోవడంతో బయ్యర్లు నష్టపోయారు.  ఫస్ట్ పార్ట్ మిగిల్చిన చేదు అనుభవంతో.. సెకండ్ పార్ట్ లో ఆ తప్పులు చేయకూడని.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉంది యూనిట్.  

అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా ఫిబ్రవరి 7 వ తేదీన రిలీజ్ కావాలి.  సినిమాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు మరో వారం రోజులు సమయం తీసుకున్నారు.  ఫిబ్రవరి 22 న రిలీజ్ అవుతుందని అనుకుంటే.. నెలాఖరు వరకు రిలీజ్ అయ్యే అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది.  కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తున్నారని.. పక్కాగా హిట్ ఫార్ములాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తోంది.