మెగాస్టార్ సినిమా అందుకే ఆగిపోయిందా?  

మెగాస్టార్ సినిమా అందుకే ఆగిపోయిందా?  

ఆర్జీవీ సినిమాలు సూపర్ హిట్ అవుతున్న రోజుల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.  చాలా సినిమాలు హిట్ కొట్టాడు.  అదే సమయంలో మెగాస్టార్ తో సినిమా చేయాల్సి ఉన్నది.  సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా పూర్తయ్యాయి.  రెండు సాంగ్స్ కూడా చిత్రీకరించారు.  మెగాస్టార్ తో పాటుగా ఈ సినిమా హీరోయిన్ గా టబును తీసుకున్నారు.  సి అశ్వినీదత్ ఈ సినిమాకు నిర్మాత.  

ఇంతవరకు బాగానే ఉన్నది.  అయితే, స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి ఎక్కడో డౌట్ వచ్చి స్క్రిప్ట్ లో మార్పులు చెప్పారట.  అసలే వర్మ.  ఎవరి మాట వినడు.  ఒక్కసారి స్క్రిప్ట్ రెడీ అయితే, దాన్ని దేవుడు వచ్చి మార్చమన్నా మార్చడు.  ఇదే విషయం మెగాస్టార్ కు చెప్పాడు.  స్క్రిప్ట్ మార్చేందుకు ససేమిరా అన్నారు.  దీంతో మెగాస్టార్ ఈ సినిమా చేయనని పక్కకు తప్పుకున్నారట.  ఆ సినిమా పేరు వినాలని ఉంది.  దీనికోసం రెడీ చేసిన రెండు సాంగ్స్ ను గుణశేఖర్ చూడాలని ఉంది సినిమాలో పెట్టుకున్నారు.  ఆ తరువాత మెగాస్టార్ తో వర్మ సినిమా చేయలేదు.  ఫ్యూచర్ లో ఏమో చెప్పలేం.