అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమం తాజ్ డెక్కన్ లో జరిగింది. ఈ సక్సెస్ మీట్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సక్సెస్ మీట్ అనగానే ఆ సినిమాలో నటించిన ముఖ్యతారాగణం అందరు పాల్గొంటారు. అయితే, నాపేరు సూర్య విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. ఈ సక్సెస్ మీట్ కు నిర్మాత, దర్శకుడు, హీరో హాజరయ్యారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
ముఖ్యఅతిధిగా హాజరైన పవన్ తన ప్రసంగాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేశాడు. వచ్చాను కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాను అన్నట్టుగా ఉన్నది పవన్ ప్రసంగం. ఈ సినిమాకు అన్నయ్య నాగబాబు నిర్మాతగా వ్యవహరించాడనే విషయం తనకు తెలియదని.. అల్లు అర్జున్ ఆర్య సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన పవన్.. భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్టు పవన్ పేర్కొన్నాడు.
అల్లు అర్జున్ కూడా చాలా తక్కువగా మాట్లాడి ముగించేశాడు. ఈ సినిమా చూసిన తరువాత తల్లిదండ్రులు తమ పిల్లలకు మిలటరీ డ్రెస్ లను కొనిపెడుతున్నారని అన్నారు. సక్సెస్ మీట్ ముఖ్య అతిధిగా హాజరైన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు అని చెప్పి ముగించేశాడు.
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగబాబు వంటి మెగా ఫ్యామిలీ హాజరైన ఈ ఈవెంట్ భారీ ఎత్తున, జోష్ గా జరగాలి. చాలా ఇలా చప్పగా జరగడంతో పాపం ఫ్యాన్స్ డీలా పడ్డారు. సినిమాకు నెగెటివ్ టాక్ వస్తుండటంతో.. సక్సెస్ మీట్ ను ఇలా తొందరగా ముగించేశారని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)