ఆ సినిమా ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉండేదో..!!

ఆ సినిమా ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉండేదో..!!

శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు వేగేశ్న సతీష్.  కుటుంబాల మధ్య ఉండే సంబంధాలను ఆ సినిమాలో అద్భుతంగా చూపించాడు.  దిల్ రాజు ఆ సినిమాకు నిర్మాత.  దీనిని పక్కన పెడదాం.  ప్రసుత పరిస్థితికి వస్తే.. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో వచ్చిన శ్రీనివాస కళ్యాణం సినిమా ఇటీవలే రిలీజ్ అయింది.  నితిన్.. రాశిఖన్నా ఇందులో జంటగా నటించారు.  దిల్ రాజు భారీ పబ్లిసిటీ చేయడంతో మొదటి నుంచి సినిమాకు హైప్ వచ్చింది.  

ఆగష్టు 9 న రిలీజయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నది.  వివాహం అంటే ఏంటి.. అందులో ఎన్ని తంతులు ఉంటాయి.  వాటిని ఎలా నిర్వహిస్తారు.  అనే విషయాలను ఈ సినిమా ద్వారా చెప్పాలని అనుకున్నాడు సతీష్.  చెప్పాలని అనుకున్న పాయింట్ బలంగా ఉన్నది.  సినిమాలో కమర్షియల్ ఫార్మాట్ లో లేకపోవంతో కొంతమంది ఆడియన్స్ ఎక్కలేదు. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదట వేగేశ్న సతీష్ దిల్ రాజుకు చెప్పినపుడు.. ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని భావించాడట. 

సతీష్ తో ఎన్టీఆర్ కు కథ కూడా చెప్పించాడు.  తరువాత ఏమైందో తెలియదు.  ఎన్టీఆర్ నుంచి ప్రాజెక్ట్ నితిన్ కు వెళ్ళింది.  ఎన్టీఆర్ కమర్షియల్ మాస్ హీరో.  కమర్షియల్, మాస్ అంశాలు రెండు సినిమాలో ఉండాలి.  అప్పుడే అభిమానులు సినిమా చూస్తారు.  బహుశా ఎన్టీఆర్ ఈ సినిమాను ఒప్పుకోక పోవడానికి ఆ రెండు కారణాలు అయ్యుండొచ్చు.