సైరాపై ఎన్టీఆర్ సైలెంట్.. ఎందుకు..?

సైరాపై ఎన్టీఆర్ సైలెంట్.. ఎందుకు..?

మెగాస్టార్ హీరోగా చేసిన సైరా సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ అయ్యి అందరి ప్రశంసలు పొందుతున్నది.  కలెక్షన్ల పరంగా కూడా సినిమా దూసుకుపోతున్నది.  భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాను సెలెబ్రిటీలు మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.  ఇండస్ట్రీలో చరణ్ కు బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మహేష్ బాబు ఇప్పటికే సైరా గురించి ట్వీట్ చేశారు.. నాగ్ ఫ్యామిలీ కూడా సినిమాను చూసి మెగాస్టార్ ను మెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో టాప్ దర్శకులు సైతం సైరా సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  

అయితే, చరణ్ కు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి ట్వీట్ చేయలేదు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న రామ రౌద్ర రుషితం సినిమాలో చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్నారు.  ఈ సినిమాతో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మరింత పెరిగింది.  అయితే, సైరా గురించి ఎన్టీఆర్ ఇప్పటి వరకు మాట్లాడకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. మెగా.. నందమూరి ఫ్యామిలీ మధ్య ఉన్న దూరం అలానే ఉందని బహుశా అందుకే ఈ సినిమా గురించి ఎన్టీఆర్ తన అభిప్రాయం చేప్పలేదని కొందరు అంటున్నారు. ఎన్టీఆర్ బిజీగా ఉన్న కారణంగా సినిమా చూడలేదేమో అని కొందరు అంటున్నారు.   అటు బాలయ్యబాబు కూడా సైరా గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం.