బెత్తం దెబ్బలు చాలంటే... పవన్ అప్పుడు గన్ ఎందుకు పట్టాడు..?

బెత్తం దెబ్బలు చాలంటే... పవన్ అప్పుడు గన్ ఎందుకు పట్టాడు..?

పవన్ కళ్యాణ్ గురించి రోజా ఈరోజు ఏపి అసెంబ్లీలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అత్యాచారం చేసిన వ్యక్తులకు సింగపూర్ తరహా శిక్షలు విధించాలని, బెత్తంతో తాట ఊడేలా కొట్టాలని పవన్ ఇటీవలే తిరుపతిలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఒక మనిషిని చంపే హక్కు మనకు లేదని, చట్టప్రకారమే శిక్షలు విధించాలని, చట్టాలను కఠినం చేయాలని పవన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  

అయితే, పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీలో రోజా స్పందించారు.  అత్యాచారం చేసిన నిందితులను రెండు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుందని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు.  రెండు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుందని చెప్పిన పవన్ కళ్యాణ్, తన అన్న కూతురి విషయంలో ఎందుకు పవన్ అంతలా రెచ్చిపోయారని, గన్ పట్టుకొని రోడ్డుమీదకు ఎందుకు వచ్చారో చెప్పాలని అన్నారు.  రోజా చేసిన ఈ వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేశారు.  సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం తగదని, అది సభా ఉల్లంఘన అవుతుందని అన్నారు.