దాచిపెట్టడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో..?

దాచిపెట్టడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో..?

రాజమౌళి సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  సినిమా ఓపెనింగ్ రోజే జానర్ గురించి.. కథ గురించి చూచాయగా చెప్పేస్తారు.  ఆ తరువాత సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకోమని ప్రేక్షకులకు వదిలేస్తారు.  ఆర్ఆర్ఆర్ విషయంలో అందుకు భిన్నంగా ఉన్నాడు రాజమౌళి.  అసలు ఎలాంటి క్లూ ఇవ్వడం లేదు.  ఈ సినిమా గురించి అనేక పుకార్లు బయటకు వచ్చినా.. అందులో ఏది నిజం అన్నది మాత్రం స్పష్టంగాలేదు.  

సినిమా ఓపెనింగ్ సమయంలో తప్పకుండా రాజమౌళి మీడియాతో ఇంటరాక్ట్ అవుతాడు.  ఈ సినిమాకు అందుకు భిన్నంగా మీడియాను అనుమతించలేదు.  ఈ సినిమా గురించి బయట కూడా ఎవరు మాట్లాడొద్దని ఇప్పటికే స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారట.  రామ్ చరణ్ వినయ విధేయ రామ ప్రమోషన్స్ సమయంలోను ఈ సినిమా గురించి మాట్లాడొద్దని చెప్పినట్టుగా సమాచారం.  ఇంతగా ఈ సినిమా గురించి ఎందుకు దాచిపెడుతున్నారో అర్ధం కావడంలేదు.  

రాజమౌళి సినిమా అంటేనే హైప్ ఉంటుంది.  ఇలా సినిమా గురించి ఏమి చెప్పకుండా దాచిపెడితే.. ఇంకెంత హైప్ వస్తుందో మరి.