పాపం రకుల్... ఇప్పుడెలా..!!?

పాపం రకుల్... ఇప్పుడెలా..!!?

రెండేళ్ల క్రితం వరకు రకుల్ ప్రీత్ కు సినిమా అవకాశాలు వరసగా వచ్చేవి.  స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది.  చిన్న సినిమాతో ప్రస్థానం మొదలు పెట్టినా.. అవకాశాలు దక్కించుకోవడంలో మాత్రం చాలా స్పీడ్ ను ప్రదర్శించింది ఈ బుట్టబొమ్మ.  కెరీర్లో మంచి విజయాలు అందుకున్నా.. గత రెండేళ్లుగా వరసగా ప్లాప్ సినిమాలు చేస్తుండటంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.  

రకుల్ కు ఇద్దామని అనుకున్న ఛాన్స్ లు వేరే వాళ్లకు వెళ్లిపోతున్నాయి.  వెంకిమామ విషయంలోనూ అదే జరిగింది.  రకుల్ స్థానంలో రాశి ఖన్నా వచ్చింది.  అటు వాల్మీకి సినిమాలో అనుపమకు చోటు దక్కింది.  తెలుగులో అవకాశాలు తగ్గిపోతున్నాయి. కోలీవుడ్ లో మాత్రం సినిమా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది.  దేవ్ పై ఆశలు పెట్టుకుంటే అదికాస్తా ప్లాప్ అయింది.  ప్రస్తుతం సూర్యతో ఎన్జీకే చేస్తోంది.  రాజకీయ నేపధ్యంలోని సినిమా కావడం... సూర్య నటన బాగుందనే టాక్ రావడంతో సినిమాపై నమ్మకం పెరిగింది.  ఈ ఎన్జీకే హిట్టయితే.. రకుల్ కు మరలా అవకాశాలు వస్తాయి.  చూద్దాం ఏమౌతుందో.