రానా రిస్క్ చేస్తున్నాడా..?

రానా రిస్క్ చేస్తున్నాడా..?

లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా దగ్గుబాటి వారసుడు, ఆ తరువాత నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం, డిపార్ట్మెంట్, ఏ జవానీ హై దివాని, బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి, ఘాజీ వంటి సినిమాల్లో నటించిన ఈ యువ నటుడు ఇప్పుడు ఓ భారీ సాహసం చేయబోతున్నాడు.  పురాణకాలంలోని హిరణ్యకశివుడు పాత్ర ఆధారంగా భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ భక్త ప్రహ్లాద సినిమా చేస్తున్నాడు.  

గతంలో భక్త ప్రహ్లాద సినిమా వచ్చింది కదా.  ఆ కథ గురించి అందరికి తెలుసు కదా.  మరెందుకు ఇప్పుడు మరలా ఆ సినిమాను చేస్తున్నట్టు.  గుణశేఖర్ కథను రాసుకున్న తీరు, ఆయన వర్ణన వేరుగా ఉంటుంది.  రుద్రమదేవి గురించి అందరికి తెలుసు.  ఆ రుద్రమదేవి కథను ఆధారంగా చేసుకొని గుణశేఖర్ తీసిన రుద్రమదేవి ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.  అదే బాటలో ఇప్పుడు ఆ పురాణం కథను సిద్ధం చేస్తున్నాడు.  ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.  అప్పట్లో ఎస్వీఆర్, ఎన్టీఆర్ వంటి భారీ పర్సనాలిటి ఉన్న రానా హిరణ్యకశివుడిగా ఏ మేరకు మెప్పిస్తాడా చూడాలి.