రష్మిక ఎందుకు క్యాష్ చేసుకోవడంలేదో..!!

రష్మిక ఎందుకు క్యాష్ చేసుకోవడంలేదో..!!

రష్మిక ఇప్పుడు తెలుగులో డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు.  వరసగా మూడు సినిమాలు హిట్ అయ్యాయి.  మొదటి సినిమా ఆమెకు హిట్ ఇవ్వడంతో పాటు.. తెలుగులో ఆఫర్లు వచ్చేందుకు దోహదపడింది.  

రెండో సినిమా గీత గోవిందం సూపర్ హిట్. రెండో సినిమా రూపంలో ఇలాంటి హిట్ వచ్చాక స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయమే.  అందులోను ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది.  మూడో సినిమాగా వచ్చిన దేవదాస్ కూడా సూపర్ హిట్ అయింది. మూడు హిట్ కావడంతో లక్కీ హీరోయిన్ గా మారింది.  

ఒక సినిమాలో నటించిన హీరోయిన్స్ కు మాల్స్ ఓపెనింగ్ చేసే అవకాశాలు వస్తుంటాయి.  ఇలా వచ్చిన అవకాశాలను వారు క్యాష్ చేసుకుంటుంటారు.  మినిమమ్ రూ.10 లక్షలు తీసుకుంటుంటారు.  కానీ, రష్మిక అలా చేయడం లేదట.  ఇటీవలే రష్మిక తెలంగాణలోని మహబూబ్ నగర్లో ఓ మాల్ ఓపెనింగ్ కు వెళ్ళింది.  మాల్ ఓపెన్ కోసం కోసం కేవలం రష్మిక తీసుకున్నది ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.  కేవలం రూ.5 లక్షలు మాత్రమే తీసుకుందట.  ఇలా తగ్గించి తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటని ఇప్పడు అందరుఆలోచిస్తున్నారు.  తక్కువ తీసుకోవడం వలన ఎక్కువ ఆఫర్లు వస్తాయని కావొచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.