రూ. 2వేల నోటు ఇక కనిపించదా..?

రూ. 2వేల నోటు ఇక కనిపించదా..?

రెండువేల రూపాయల నోటును బ్యాన్ చేస్తున్నారా.. అందుకే నోట్లు విపణిలో కనిపించడం లేదా. ఆర్బీఐ రెండువేల నోటు ప్రింటింగ్ ను ఎందుకు ఆపేసింది.. వీటికి ఆర్బీఐ సమాధానాలు చెప్పింది.  ఆర్బీఐ చెప్పిన వివరాల ప్రకారం.. రెండువేల రూపాయల నోటు ను బ్యాన్ చేయడం లేదని చెప్పింది.  అయితే, రెండువేల రూపాయల నోటు ప్రింటింగ్ ను ఆపేసినట్టు తెలిపింది.  

2016 వ సంవత్సరం నుంచి రెండువేల రూపాయల నోటును ప్రింట్ చేస్తూ వస్తున్నారు.  అయితే ప్రతి ఆర్ధిక సంవత్సరంలో ఈ నోటు ప్రింటింగ్ ను తగ్గించుకుంటూ వస్తున్నారు.  ఈ ఆర్ధిక సంవత్సరంలో ఒక్క నోటుకూడా ప్రింట్ కాలేదు.  పెద్దనోట్లను బ్యాన్ చేసిన తరువాత రెండువేల రూపాయల నోటును కొన్ని రోజులే ఉంటుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి.  అలా వచ్చిన వార్తలకు అనుగుణంగానే ఇపుడు 2వేలరూపాయల నోట్లు ప్రింట్ కావడం లేదు.  ఈ నోట్లు ప్రింటింగ్ ఆపేయడానికి కారణాలు ఉన్నాయి, పాకిస్తాన్ ఈ నోట్లకు నకిలీ తయారు చేసి ఇండియాలో చలామణి చేస్తున్నది.  గత మూడేళ్ల వ్యవధిలో దాదాపుగా 50 కోట్ల రూపాయల నకిలీనోట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది.