పాపం ఆ దర్శకుడికి ఛాన్స్ దొరకట్లేదు...

పాపం ఆ దర్శకుడికి ఛాన్స్ దొరకట్లేదు...

అర్జున్ రెడ్డి తరువాత ఆ తరహాలో వచ్చి హిట్ కొట్టిన చిత్రం ఆర్ఎక్స్ 100.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.  బయ్యర్లకు లాభాల పంట పండించింది.  ఆర్ఎక్స్ 100 హిట్ కొట్టడంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అనుకున్నాడు.  మొదట్లో చాలా మంది హీరోలు అజయ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు.  మరేమైందో తెలియదు... ఒక్క సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు.  

ఫైనల్ గా నాగచైతన్య ... అజయ్ భూపతి కాంబినేషన్లో సినిమా వస్తుందని అనుకున్నారు.  నాగచైతన్యను పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారని ప్రచారం జరిగింది.  ప్రచారమైతే జరిగిందిగాని, ఆ దిశగా అడుగులు పడినట్టు కనిపించలేదు.  చైతుకు చేతిలో వరసగా సినిమాలు ఉన్నాయి.  ప్రస్తుతం వెంకిమామ చేస్తున్నాడు.  దీని తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా ఉంది.  ఆ తరువాత దిల్ రాజు సినిమా.. ఆ వెంటనే సొంత బ్యానర్లో రామరాజు సినిమా ఉంది.  వీటి తరువాతే ఏదైనా సినిమా ఉండొచ్చు.  అప్పటి వరకు అజయ్ ఆగుతాడా...? పాపం మొదటి సినిమాతో హిట్ కొట్టిన అజయ్... సెకండ్ సినిమా ఛాన్స్ కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో కదా.