ఖాన్ త్రయంతో మల్టీస్టారర్ సినిమా...

ఖాన్ త్రయంతో మల్టీస్టారర్ సినిమా...

ఖాన్ త్రయం అనగానే మనకు గుర్తుకు వచ్చేది సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్.  ఈ ముగ్గురు బాలీవుడ్ ను చాలా కాలం ఏలారు.  ఇప్పటికి ఈ ముగ్గురిదే హవా.  విభిన్నమైన కథలను ఎంచుకొని సినిమాలు చేయడంలో అమీర్ ఖాన్ సిద్ద హస్తుడు.  షారుఖ్ కూడా అంతే.  సల్మాన్ ఖాన్ కు మాస్ లో మంచి పేరుంది.  ఈ ముగ్గురు ఎప్పుడైనా ఎక్కడైనా కలుస్తారా అనే సందేహం రావొచ్చు.  ఓ బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం... 

ఈ ముగ్గురు స్టార్స్ ముంబైలో ఉంటె తప్పకుండా రెగ్యులర్ గా కలుస్తుంటారట.  ఇలా కలుస్తారనే విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.  షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్ లో ముగ్గురు కలుస్తుంటారు.  ఎక్కువగా నైట్ టైమ్ లో కలిసి అర్ధరాత్రి వరకు వెళ్ళిపోతారట.  మీడియాకు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ముగ్గురు కలుస్తారట.  ఇలా కలిసినపుడు వీరిమధ్య వీరి సినిమాల గురించే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్స్ గా ఎదుగుతున్న విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్, ఆయుష్మాన్ ఖురానాల గురించి ఎక్కువగా చర్చించుకుంటుంటారని బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం తెలుస్తోంది.  భవిష్యత్తులో ముగ్గురు కలిసి ఒకే సినిమా చేసే అవకాశం గురించి కూడా అప్పుడప్పుడు చర్చించుకుంటారని ఆ మీడియా కథనాన్ని బట్టి తెలుస్తోంది.